మహేష్ బాబు తరువాత సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు…?

టాలీవుడ్ జూనియర్ హీరో మన విజయ్ దేవరకొండ. అయన నటించిన సినిమా ‘గీత గోవిందం’. ఈ సీమను అభిమానుల ముందుకు తెచ్చిన దర్శకుడు పరశురామ్. ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. దాంతో గీతా ఆర్ట్స్ బ్యానర్లోనే ఆయన మరో సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు టాలీవుడ్ హీరో మహేష్ బాబుతో కలిసి ఓ సినిమాను తేరాకెక్కిస్తున్నాడు. మహేశ్ బాబు ఇంటికి వెళ్లి ఆయన శ్రీమతి నమ్రతతో మాట్లాడి వచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. పరశురామ్ దగ్గర మహేశ్ బాబుకి సెట్ అయ్యే మంచి కథ ఉందనీ .. మహేశ్ బాబు డేట్స్ ఉంటే తాను నిర్మిస్తానని ఆమెతో చెప్పాడట. గీతా ఆర్ట్స్ బ్యానర్ కావడం వలన డేట్స్ తప్పకుండా ఇస్తామనీ, అయితే పూర్తి స్క్రిప్ట్ ను సిద్ధం చేసి వినిపించమని నమ్రత అన్నట్టుగా సమాచారం. ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ పైనే పరశురామ్ కసరత్తు చేస్తున్నట్టుగా చెబుతున్నారు.Image result for mahesh babu photos

Leave a Response