వెళ్లి కథ రెడీ చేసుకో… మహేష్

టాలీవుడ్ మిల్క్ బాయ్ మహేష్ బాబు నటించిన సినిమా మహర్షి. మిల్క్ బాయ్ కి హిట్ ఇచ్చిన దర్శకులను వదులుకోడు. సాధ్యమైనంత త్వరలోనే ఆ దర్శకుడితో మరో సినిమా చేయడానికి ఆసక్తిని చూపుతాడు మన అందగాడు. ‘శ్రీమంతుడు’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన కొరటాల శివతో ‘భరత్ అనే నేను’ చేయడాన్ని ఒక ఉదాహరణగా చెప్పుకో వచ్చు. అలాగే ఇప్పుడు మహేశ్ బాబుకి ‘మహర్షి’ సినిమాతో వంశీ పైడిపల్లి భారీ విజయాన్ని అందించాడు. ఈ సినిమా సక్సెస్ కావడమే కాదు, ఎమోషనల్ గా తన అభిమానుల హృదయాలకి మరింత చేరువగా తీసుకెళ్లిందని మహేశ్ బాబు భావించాడు. అందువల్లనే తన కోసం మరో మంచి కథను సిద్ధం చేయమని వంశీ పైడిపల్లితో మహేశ్ బాబు చెప్పినట్టుగా ఫిల్మ్ నగర్లో గుసగుసలు వినిపిస్తన్నాయి.Image result for mahesh babu

Leave a Response