టాలీవుడ్ మిల్క్ బాయ్ మహేశ్ బాబు తన 26వ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో అభిమానుల ముందుకు తెస్తున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. వచ్చేనెలలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి అవసరమైన ఏర్పాట్లను అనిల్ రావిపూడి చకచకా కానిచ్చేస్తున్నాడు.
వచ్చేనెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగును ఆరంభించినప్పటికీ, కొంత ఆలస్యంగా మహేశ్ బాబు జాయిన్ అవుతాడని అంటున్నారు. దిల్ రాజు – అనిల్ సుంకర నిర్మించే ఈ సినిమాను ‘భోగి’ రోజునగానీ .. సంక్రాంతి రోజున గాని విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఈ సినిమాను లాంచ్ చేసే రోజునే విడుదల తేదీ చెప్పేయాలనే నిర్ణయానికి వచ్చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.