రెగ్యులర్ గా జరుగుతుందని సినిమా చేశాను…?

టాలీవుడ్ లో తన తొలి సినిమాతోనే తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో సంచ‌ల‌నం సృష్టించిన హీరోయిన్ ఉత్త‌రాది భామ పాయ‌ల్ రాజ్‌పుత్‌. ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి రూపొందించిన `ఆర్ఎక్స్‌100` సినిమాలో పాయ‌ల్ అత్యంత బోల్డ్‌గా న‌టించిన సంగ‌తి మన అందరికి తెలిసిందే. తెలుగు తెర‌పై నెగిటివ్ రోల్‌లో న‌టించిన హీరోయిన్‌గా నిలిచింది ఈ అమ్మడు. ఆ సినిమా ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గుర్తింపు సంపాదించిన పాయ‌ల్ ప్ర‌స్తుతం ప‌లు సినిమాల‌తో బిజీగా ఉంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో ఆ సినిమా గురించి మాట్లాడింది.Related image

`నిజం చెప్పాలంటే న‌టిగా నేను గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు దూరంగా ఉంటాను. అయితే కొత్త త‌ర‌హా పాత్ర‌లు వ‌స్తే వ‌దులుకోను. `ఆర్ఎక్స్‌100` సినిమా క‌థను చాలా మంది హీరోయిన్ల‌కు వినిపించార‌ట‌. వారెవ‌రూ ఆ సినిమా చేసేందుకు అంగీక‌రించ‌లేద‌ట‌. ఆ క‌థ విన్న‌ప్పుడు నేను షాక‌వ‌లేదు. ఎందుకంటే అలాంటివి ప్రస్తుతం స‌మాజంలోనూ జ‌రుగుతున్నాయి. నేను చేయ‌బోయే సినిమాలో నా పాత్ర చాలా బోల్డ్‌గా ఉంటుంద‌ని ఇంట్లో చెప్పాను. అమ్మానాన్నా మొద‌ట అభ్యంత‌ర పెట్టినా త‌ర్వాత అంగీక‌రించారు. అయితే సినిమా చూసిన త‌ర్వాత మాత్రం ఇద్ద‌రూ షాక‌య్యార`ని పాయ‌ల్ చెప్పిందట.

Leave a Response