బాహుబలిని మించిన మహర్షి…?

టాలీవుడ్ దర్శకుడు వంశీపైడితల్లి ద‌ర్శ‌క‌త్వంలో సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన సినిమా `మ‌హ‌ర్షి`. టాక్ సంగ‌తి ఎలా ఉన్నా అదిరిపోయే ఓపెనింగ్స్‌తో రికార్డు క‌లెక్ష‌న్లు రాబ‌ట్టింది. నైజాంలో `బాహుబ‌లి-1` రికార్డును అధిగ‌మించింది.ఈ సినిమా తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 24.6 కోట్ల షేర్ సాధించిన‌ట్టు పీఆర్‌వో బీఏ రాజు ట్విట‌ర్ ద్వారా తెలిపారు. నైజాంలో `బాహుబ‌లి-1` తొలి రోజు 6.28 కోట్లు వ‌సూలు చేసింది. గురువారం విడుద‌లైన `మ‌హ‌ర్షి` ప‌ది ల‌క్ష‌లు ఎక్కువ‌గా 6.38 కోట్లు ద‌క్కించుకుంది. వేస‌విలో భారీ సినిమాలు లేక‌పోవ‌డం, రేట్లు పెంపు వంటి అంశాలు, అద‌నంగా షోలు వేయ‌డం వంటి కార‌ణాలు `మ‌హ‌ర్షికి` క‌లిసి వ‌చ్చాయి.Image result for maharshi movie pics

Leave a Response