వైసీపీ నేత గుడివాడ అమర్ నాథ్ ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలన చూసి బాబుకు మతిపోయినట్టుందని, లేక మత్తులో ఇష్టంవచ్చినట్టు మాట్లాడుతున్నాడో తెలియడంలేదని విమర్శించారు.చంద్రబాబు విశాఖ వస్తే తనకోసం లక్షల మంది స్వాగతం పలకడానికి వచ్చినట్టు ఫీలైపోతున్నారని, జగన్ తో ఫొటోలు దిగడానికి వచ్చారంటే ఓ అర్థం ఉందని, కానీ చంద్రబాబు కోసం అంతమంది రావడానికి ఆయన వద్ద అందం ఉందా? హీరోయిజం ఉందా? లేక ఆయనేమైనా శోభన్ బాబా? అంటూ వ్యాఖ్యానించారు. తన ఇంట్లోవాళ్లకు శోభన్ బాబులా కనిపిస్తారేమో కానీ తమకు కాదని, కనీసం చంద్రబాబు మాటల్లో కూడా అందం ఉండదని అన్నారు. వెన్నుపోట్లు, మేనేజ్ మెంట్ రాజకీయాలు తప్ప చంద్రబాబు గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదని అన్నారు.