ఒక కొత్త ప్రేమకథను పరిచయం చేయడానికి ‘దొరసాని’ సినిమా సిద్ధమవుతోంది. మధుర శ్రీధర్ రెడ్డి .. యష్ రంగినేని నిర్మిస్తోన్న ఈ సినిమాకి, కేవీఆర్ మహేంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. జీవితా రాజశేఖర్ రెండవ కూతురు శివాత్మిక ప్రధాన పాత్రధారిగా రూపొందుతోన్న ఈ సినిమాలో, ఆమె జోడీగా విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ నటిస్తున్నాడు.తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. గ్రామీణ నేపథ్యంలో దొరవారి కుటుంబానికి చెందిన యువతిగా నాయిక కారులో వెళుతూ వుంటే, ఒక సాధారణమైన కుటుంబానికి చెందిన యువకుడిగా ఆ కారు పక్కనే సైకిల్ పై వెళుతూ హీరో కనిపిస్తున్నాడు. ఈ ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందనే విషయం ఈ పోస్టర్ ను బట్టే తెలిసిపోతోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
previous article
సినిమా టైటిల్ కోసం తల పట్టుకున్న మహేష్..
next article
కృష్ణ పుట్టినరోజు… మహేశ్ 26వ చిత్రం టైటిల్
Related Posts
- /No Comment