అనుష్క ప్రధాన పాత్రధారిగా ‘సైలెన్స్’…?

టాలీవుడ్ హీరోయిన్ అనుష్క. ‘భాగమతి’ తరువాత నాయికా ప్రాధాన్యత కలిగిన మరో సినిమా చేయడానికి అనుష్క అంగీకరించింది .. ఆ సినిమా పేరే ‘సైలెన్స్’. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా, తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ అభిమానుల ముందుకు వస్తుంది. కథా పరంగా ఈ సినిమా షూటింగు అమెరికాలో జరగనుంది. అంతా రెడీగా ఉన్నప్పటికీ అనుష్కకి వీసా రాకపోవడం వలన ఆలస్యమైంది. తాజాగా అనుష్కకి వీసా రావడంతో, త్వరలో అమెరికా వెళ్లేందుకు ఈ సినిమా టీమ్ సన్నాహాలు చేసుకుంటోంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో హాలీవుడ్ నటుడు మైఖేల్ మ్యాడ్సన్ తో పాటు మాధవన్ .. అంజలి .. షాలినీ పాండే నటించనున్నారు.Image result for anushka shetty

Leave a Response