టాలీవుడ్ లో 50 సినిమాలను పూర్తి చేసిన అల్లరి నరేశ్ కి, ఆ తరువాత వరుస పరాజయాల కారణంగా దూకుడు తగ్గిందన విషయం మన అందరికి తెలిసిందే. ఆయన మల్టీ స్టారర్ల వైపు ఆసక్తి చూపడమే కాకుండా, ముఖ్యమైన పాత్రలను పోషించడానికి కూడా ఉత్సాహాన్ని చూపుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన తాజా ‘మహర్షి’ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో నరేశ్ పోషించిన పాత్రకి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో ‘అల్లరి’ నరేశ్ మాట్లాడుతూ .. ‘మహర్షి’ సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ .. నా పాత్రకి దక్కుతోన్న ఆదరణ ఆనందాన్ని కలిగిస్తున్నాయి. 17 సంవత్సరాల క్రితం మే 10వ తేదీన నా మొదటి సినిమాగా ‘అల్లరి’ వచ్చింది. ఆ సినిమాలో నేను ‘రవి’ అనే పాత్రను పోషించాను .. ‘మహర్షి’లోను ‘రవి’ అనే పాత్రనే చేశాను. అందువలన ఈ సినిమాతో నా లైఫ్ ఫుల్ సర్కిల్ పూర్తయినట్టు నేను భావిస్తున్నాను” అంటూ ఆయన తన అభిప్రాయాన్ని తెలిపారు.
previous article
కెన్యాలో పరిచయగీతం
next article
ప్రభుత్వం తలచుకుంటే అదొక్కరోజు పనే!
Related Posts
- /No Comment
దేవుడి దర్శనం …. నాని ప్రసన్నం
- /No Comment