ప్రఖ్యాతి గాంచిన కళలు మరియు హస్త కళా వస్తువుల గ్రామం మాదాపూర్ లో హైటెక్ సిటీ కి దగ్గరలో ఉన్న శిల్పారామం. హైదరాబాద్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశం ఆంధ్ర ప్రదేశ్ యొక్క హస్తకళలకే కాకుండా దేశ వ్యాప్తంగా కళలకి ప్రాముఖ్యత పొందిన ప్రాంతం. భారత దేశం యొక్క పురాతన కళల సంప్రదాయాలని రక్షించే ఆలోచనతో ఈ గ్రామాన్ని నిర్మించారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఏడాది పొడవునా సాంప్రదాయక పండుగలని ఈ శిల్పారామంలో నిర్వహిస్తారు. 1992 లో ప్రారంభమైన దేశం లో ని వివిధ సాంప్రదాయక పండుగలని చక్కగా నిర్వహించడం వలన ఈ గ్రామం జాతీయ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ పండుగలు వల్ల భారత దేశం యొక్క వివిధ హస్తకళాకృతుల గురించి తెలియడమే కాకుండా అంతరించిపోకుండా ప్రాచీన కళల ని సంరక్షించే అవకాశం కూడా మీకు లభిస్తుంది.ఐతే హైదరాబాద్ లో ఇప్పటికే ఓ శిల్పారామం ఉండగా, నగర తూర్పుప్రాంతానికి కూడా అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ఉప్పల్ లో మినీ శిల్పారామం నిర్మించారు. ఏడాది క్రితం దీనికి శంకుస్థాపన జరగ్గా, ఈ సాయంత్రం ప్రారంభోత్సవం జరుపుకుంది. ఉప్పల్ వద్ద మూసీ నదీ తీరంలో ఏర్పాటైన ఈ తాజా శిల్పారామం ప్రారంభోత్సవంపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. హైదరాబాద్ నగర తూర్పు ప్రాంతంలో కూడా ఓ శిల్పారామం ఏర్పాటవడం సంతోషదాయకం అని పేర్కొన్నారు ప్రజలు.
previous article
తడ్రి పై మరిన్ని బాధ్యతులు వేసిన కొడుకు…
next article
గోపీచంద్ చేతుల మీదుగా ‘జైసేన’ టీజర్…
Related Posts
- /No Comment
కౌన్ బనేగా కరోడ్పతి షోలో అమితాబ్ ఆమె కాళ్లుమొక్కారు..?
- /No Comment