తడ్రి పై మరిన్ని బాధ్యతులు వేసిన కొడుకు…

టాలీవుడ్ సీనియర్ హీరో చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహా రెడ్డిగా సినిమా తీయాలని చాలా కాలంగా చర్చలు నడిచాయి. అయితే వివిధ నిర్మాతలతో జరిపిన చర్చలు విఫలం కావటంతో విసిగిపోయి చివరికి ఈ సినిమాను తానే నిర్మిస్తున్నట్లుగా రాంచరణ్ జూలై 2017లో ప్రకటించాడు. “తెలుగు సినీ చరిత్రలోనే అతి పెద్ద సినిమాలలో ఇది కూడా ఒకటి అవుతుంది. దీనికి బడ్జెట్ ఇంత అని కేటాయించలేదు. నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో, అంతటినీ నేనే భరిస్తాను. ఎందుకంటే ఈ సినిమా, నాన్నగారి చిరకాల స్వప్నం” అని టీజర్ విడుదల తర్వాత ఒక ముఖాముఖిలో రాం చరణ్ తెలిపారు. “నీ రెండవ సినిమాలోనే నువ్వు యుద్ధవీరుని పాత్ర పోషించావు. 150 సినిమాలు చేసినా నాకు అలాంటి అవకాశం రాలేదు. ” అని నాన్నగారు నా తో ఒక మారు అన్నారు. ఈ పాత్రపై ఆయనకు ఒకింత ఈర్ష్య కూడా కలిగింది. ఆ రోజు నుండే ఆయన కలను నిజం చేయటానికి ఇటువంటి చిత్రం నిర్మించాలని అనిపించేదని రాం చరణ్ తెలిపారు. సురేందర్ రెడ్డి వంటి యువ దర్శకుడు ఇంత భారీ ప్రాజెక్టుకు దర్శకత్వ బాధ్యతలు చేపట్టగలరా? అన్న ప్రశ్నకు జవాబిస్తూ “ప్రతిభకు మాకు కొదవ లేదు. అన్ని రకాల సినిమాలు చేయాలి. సినిమా కోసం తాను చేసిన పరిశోధన, అందించిన పకడ్బందీ స్క్రిప్టుతో మేము అనుకొన్న దానికంటే సురేందర్ చాలా ఎక్కువగానే కష్టపడ్డాడు.” అని రాంచరణ్ తెలిపారు. సినిమా విజయవంతం అవుతుందా అనే ప్రశ్నకు “జయాపజయాల గురించి నేను పెద్దగా పట్టించుకోదలచుకోలేదు. ఫలితం ఏదయినా నేను సంతోషంగానే ఉంటాను ఎందుకంటే నాన్నగారి కలను నిజం చేయటానికి మేము శాయశక్తులుగా ప్రయత్నిస్తున్నాము. స్క్రిప్టుకు కావలసినవన్నీ సమకూరుస్తున్నాము. వ్యక్తిగతంగా మాత్రం అన్ని రికార్డులను ఈ సినిమా రికార్డు బద్దలు కొట్టాలని నేను కోరుకొంటున్నాను.” అని తెలిపారు. ఇదే ముఖాముఖిలో సురేందర్ రెడ్డి, “మేము చాలా పరిశోధించాం. బ్రిటీషు ప్రభుత్వం నరసింహారెడ్డికి విధించిన మరణ శిక్షలో అతని గురించి క్షుణ్ణంగా తెలిపింది. 10,000 మంది సైన్యంతో నరసింహారెడ్డి బ్రిటీషు ప్రభుత్వం పై విరుచుకుపడ్డాడు. నేను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు చిరంజీవిగారి సినిమాలను మొదటి వరుసలో కూర్చొని చూసేవాడిని. ఇప్పుడు ఆయన సినిమాకే దర్శకత్వం వహించటం, పైగా అమితాబ్ వంటి వారు ఈ సినిమాలో ఉండటం నాకు నమ్మశక్యం కాకుండా ఉంది. అమితాబ్ గారైతే కేవలం చిరంజీవిగారి కోసమే ఈ సినిమాకు ఒప్పుకున్నారు. తర్వాత నేను కథ చెప్పటంతో అది ఆయనను ఆకట్టుకొంది. వారు సంతోషంగా సినిమా చేయటానికి అంగీకరించారు.” అని తెలిపారు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారనే టాక్ టాలీవుడ్ లో వినిపిస్తుంది. ఈ సినిమాకి నిర్మాతగా ఇప్పటివరకూ చరణ్ అన్ని వ్యవహారాలు చూస్తూ వచ్చాడు. అయితే ‘ఆర్ఆర్ ఆర్’ సినిమా కోసం త్వరలో ఆయన మహారాష్ట్ర వెళ్లనున్నాడు. దాదాపు నెలన్నర పాటు అక్కడ షూటింగు జరగనుంది. అందువలన ‘సైరా’కి సంబంధించిన నిర్మాణ వ్యవహారాలను కూడా చూసుకోవలసిన బాధ్యతను చిరంజీవికే చరణ్ అప్పగించినట్టుగా చెబుతున్నారు. అవసరమైనప్పుడు తగిన సహకారాన్ని అందించమని నాగబాబుకు కూడా చరణ్ ఒక మాట చెప్పాడని అంటున్నారు. దాంతో ఈ ప్రాజెక్టు విషయంలో చిరూ మరింత దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది.

Image result for saira narsimha reddy

Leave a Response