సూపర్‌ హిట్‌ డైరెక్టర్‌తో మెగా హీరో

మెగా వారసుడిగా టాలీవుడ్‌కు పరిచయం అయిన యంగ్ హీరో సాయి ధరమ్‌ తేజ్‌. కెరీర్‌ స్టార్టింగ్‌లో పరవాలేదనిపించిన సాయి ధరమ్‌ తరువాత గాడి తప్పాడు. వరుస ఫ్లాప్‌లతో కష్టాల్లో పడ్డాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో చిత్రలహరి సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత చేయబోయే సినిమాను కూడా సాయి ధరమ్‌  ఇప్పటికే ఫైనల్‌ చేశాడన్న టాక్‌ వినిపిస్తోంది.

తాజాగా గీతా ఆర్ట్స్‌ 2 బ‍్యానర్‌ లో సూపర్‌ హిట్ కొట్టిన దర్శకుడితో సాయి ధరమ్‌ తేజ్‌ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. బన్నీ వాసు నిర్మాతగా విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ సినిమా గీత గోవిందం. ఈ చిత్ర దర్శకుడు పరుశురాం అదే బ్యానర్‌లో మరో సినిమా చేసేందుకు అంగీకరించాడు. ఆ సినిమాలో సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా నటించనున్నాడట. ఇప్పటికే కథ కూడా ఫైనల్ చేశారన్న టాక్‌ వినిపిస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడే అవకావం ఉంది.

Leave a Response