ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్‌ సిద్దం

ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్దంగా ఉందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఇందులో భాగంగా ఈ నెల 7నుంచి నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తలతో సమావేశాలుంటాయని స్పష్టం చేశారు. గాంధీభవన్‌లో మర్రి శశిధర్ రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ ఎంపీ వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, కోశాధికారి గూడూరు నారాయణరెడ్డితో పాటు పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. తొమ్మిదో తేదీన గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సమావేశాలు పెట్టి ఓటరు జాబితా సవరణ క్రీయాశీలంగా చేయాలని బూతు కమిటీ అధ్యక్షలకు ఆదేశించినట్లు ఉత్తమ్ పేర్కొన్నారు. కొత్తగా అర్హులయ్యే వారందరిని ఓటరు జాబితాలో నమోదు చేయించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జనాభాకనుగుణంగా ఓటర్లు పెరగాలని…. కానీ ఇప్పుడు విడుదల చేసిన డ్రాఫ్ట్‌ ఓటర్ లిస్టులో 20 లక్షల ఓటర్లు తక్కువగా ఉన్నారని చెప్పారు. దీంతో ఓటర్ల జాబితాను ఎవరైనా టాంపరింగ్ చేస్తున్నారేమోననే అనుమానాన్ని వ్యక్తం చేశారు.

Leave a Response