కాంచన 3’ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న సందర్భంగా సినీ నటుడు రాఘవ లారెన్స్.. సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆశీర్వాదం తీసుకున్నారట. ప్రస్తుతం ముంబయిలో ‘దర్బార్’ చిత్రీకరణతో బిజీగా ఉన్న తలైవాను రాఘవ, కథానాయిక వేదిక కలిశారు. ఆయనతో కలిసి ఫొటోలు దిగారు. ఈ ఫొటోలను రాఘవ ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ.. ‘‘కాంచన 3’ విజయం సాధించిన తర్వాత నా గురువు తలైవాను కలిశాం. ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నాం’ అని తెలిపారు.
మరోపక్క రాఘవ నటిస్తూ, దర్శకత్వం వహించిన ‘కాంచన’ సినిమాకు బాలీవుడ్ కూడా ఫిదా అయిపోయింది. అందుకే ఈ సినిమాను అక్కడ కూడా రీమేక్ చేస్తున్నారు. అక్షయ్‌కుమార్ ప్రధాన పాత్రలో ‘లక్ష్మీ బాంబ్’ టైటిల్‌తో సినిమాను రాఘవ లారెన్స్ తెరకెక్కిస్తున్నారు. చిత్రీకరణ ప్రారంభమైంది. కథానాయికగా కియారా అడ్వాణీ నటిస్తున్నారు. ఇందులో అమితాబ్ బచ్చన్ హిజ్రా పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.