నా చైత‌న్య ఎప్పుడొస్తాడో: స‌మంత‌

నా చైత‌న్య ఎప్పుడొస్తాడో` అంటూ త‌న భ‌ర్త కోసం స్పెయిన్‌లో ఎదురుచూస్తోంది స‌మంత‌. చైత‌న్య‌, స‌మంత క‌లిసి న‌టించిన `మ‌జిలీ` సినిమా ఇటీవ‌ల విడుదలై ఘ‌న‌విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా త‌ర్వాత నాగార్జున న‌టిస్తున్న `మ‌న్మ‌థుడు-2` కోసం స‌మంత చిత్ర‌బృందంతో క‌లిసి పోర్చుగ‌ల్ వెళ్లింది. ర‌కుల్ ప్రీత్ సింగ్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ సినిమాలో స‌మంత అతిథి పాత్ర‌లో కనిపించ‌నుంది.

షూటింగ్ పూర్తి చేసుకున్న అనంత‌రం పోర్చుగ‌ల్ నుంచి స‌మంత స్పెయిన్‌కు వెళ్లింది. నాగ‌చైత‌న్య మాత్రం హైద‌రాబాద్‌లోనే ఉండిపోయాడు. దీంతో చైతూను బాగా మిస్స‌వుతున్న స‌మంత సోష‌ల్ మీడియాలో ఓ ఫోటోను పోస్ట్ చేసింది. బాధ‌గా చూస్తున్న త‌న స్కెచ్ ఫోటోను పోస్ట్ చేసి దానిపై `నా చైత‌న్య కోసం ఎదురుచూస్తున్నా` అని పేర్కొంది.

Leave a Response