సరదాగా చల్లటి ప్రదేశాలకు మామా అల్లుళ్లు…..

వెంకటేష్‌, నాగ చైతన్య కథానాయకులుగా నటిస్తున్న చిత్రం ‘వెంకీ మామా’. బాబి దర్శకుడు. పాయల్‌ రాజ్‌పుత్‌, రాశీ ఖన్నా కథానాయికలు. డి.సురేష్‌బాబు, టి.జి.విశ్వప్రసాద్‌  నిర్మాతలు. సూరీడు నిప్పుల కుంపటిలా  మారిపోయాడు.ఈ సమయంలో ఎవరికైనా ఏమనిపిస్తుంది? సరదాగా అలా చల్లటి ప్రదేశాలకు వెళ్లి సేద తీరాలనిపిస్తుంది. వెంకటేష్‌, నాగచైతన్యలకు కూడా అదే అనిపించింది.‘వెంకీ మామా’.చిత్రం షూటింగుకు వెంకటేష్‌, నాగచైతన్య కశ్మీర్‌ చెక్కేస్తున్నారు నెల రోజుల పాటు కశ్మీర్‌లో కీలక సన్నివేశాలు, పాటల్ని తెరకెక్కిస్తారు  వచ్చే నెల 6న రామానాయుడు జయంతి. ఈ సందర్భంగా టీజర్‌ని విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. 

Leave a Response