శ్రీహరి తనయుడి ఫస్టులుక్…

టాలీవుడ్ మరో నట వారసుడు పరిచయమవుతున్నాడు. శ్రీహరి తనయుడు మేఘాంశ్ హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆయన హీరోగా ‘రాజ్ దూత్’ సినిమా రూపొందుతోంది. సత్తిబాబు నిర్మిస్తోన్న ఈ సినిమా ద్వారా కార్తీక్ – అర్జున్ దర్శకులుగా పరిచయం కానున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి మేఘాంశ్ ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. కుర్రాడి ఫిజిక్ .. స్టైలిష్ లుక్ చూస్తుంటే, యువ హీరోలకి గట్టిపోటీ ఇస్తాడనే అనిపిస్తోంది. తన తండ్రి మాదిరిగా మాస్ హీరోగా మంచి మార్కులు కొట్టేసేలానే కనిపిస్తున్నాడు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Leave a Response