వైకాపా కార్యకర్తలు చంద్రబాబు నివాసంపై..

చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది బైబై బాబు అంటూ వైకాపా కార్యకర్తలు ఉండవల్లిలోని చంద్రబాబునాయుడు నివాసం వద్ద నినాదాలు చేయటంతో ఉద్రిక్తత ఏర్పడింది. అక్కడే ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు అడ్డుకోవటంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. వైకాపా కార్యకర్తలు పార్టీ పతాకాలతో ర్యాలీగా చంద్రబాబు నివాసం వైపు వచ్చారు. బైబై బాబు అంటూ నినదిస్తూ బాణాసంచా కాల్చేందుకు ప్రయత్నించారు. బాబు కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. అరగంటసేపు వైకాపా కార్యకర్తలు చంద్రబాబుకు వ్యతిరేకంగా నినదించారు. పోలీసుల జోక్యంతో వారు వెనుదిరిగారు.

Leave a Response