వైఎస్‌ జగన్‌ ప్రమాణస్వీకారం ఏర్పాట్లు

రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా విజయం సాధించిన వైఎస్‌ జగన్‌ ఈ నెల 30న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియాన్ని ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 30న ఉదయం 11.40 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య జగన్‌ ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం. ప్రమాణస్వీకారానికి పెద్దసంఖ్యలో ప్రజలు, పార్టీ శ్రేణులు వచ్చే అవకాశం ఉండటంతో అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ను జగన్‌ ఆదేశించారు. విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు జగన్‌ను కలిసి ప్రమాణస్వీకార ఏర్పాట్లపై చర్చించారు.ఏపీ పోలీసు శాఖ జగన్‌కు సీఎస్‌వోను నియమించింది. జగన్‌ సీఎస్‌వోగా అమర్లపూడి జోషి బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఏపీ సీఎం సెక్యూరిటీ వింగ్‌లో జోషి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Leave a Response