హస్తిన పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో భేటీ అయ్యారు. ఢిల్లీలోని రాహుల్‌గాంధీ నివాసంలో వీరి భేటీ కొనసాగుతోంది. జాతీయస్థాయిలో బీజేపీయేతర పార్టీలను ఏకం చేసి ఎన్డీఏ సర్కారు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడతానంటూ సీఎం చంద్రబాబు మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లాతో అంతకుముందు చంద్రబాబు భేటీ అయ్యారు. అనంతరం రాహుల్‌తో సమావేశమయ్యారు.
రాహుల్ గాంధీతో చంద్రబాబు భేటీ
previous article
సీఎం రేసు నుంచి నితీశ్ తప్పుకుంటారు!
next article
ఆధార్ డేటా ఉపసంహరించుకొనే అవకాశం!
Related Posts
- /No Comment
“గ్యాంగ్ లీడర్” లో “RX100”
- /No Comment