టాలీవుడ్ హీరో మహేష్ బాబు నటించిన సినిమా ‘మహర్షి’. ఈ సినిమా సక్సెస్ మీట్ ఈ సందర్భంగా మహేశ్ బాబు మాట్లాడుతూ, ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుకలో తన తండ్రి అభిమానులు, తన అభిమానులు కాలర్ ఎత్తుకుని తిరిగే చిత్రం ఇది అవుతుందని దర్శకుడు వంశీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. తమ అభిమానులే కాదు, ‘ఈరోజున నేను కూడా కాలర్ ఎత్తాను.. వంశీ’ అంటూ ఈ చిత్రం విజయం సాధించడంపై మహేశ్ తన సంతోషం వ్యక్తం చేశారు. తన కెరీర్ లో ఎంతో విజయవంతమైన చిత్రాలను ఈ చిత్రం అధిగమించబోతోందని అన్నారు. నిర్మాత అశ్వనీదత్ తనను ‘ప్రిన్స్ బాబు’ అని పిలుస్తుంటారని, ఆయనకు విపరీతంగా తాను నచ్చినప్పుడు మాత్రం ‘మహేశ్’ అని పిలుస్తారని, ‘మహర్షి’ సినిమా చూసిన తర్వాత ఆయన తనను అలా పిలిచారని మహేశ్ బాబు గుర్తుచేసుకున్నారు.
previous article
అనసూయ ‘కాతానం’ నుండి ఓ అమ్మ లిరికల్ పాట…?
next article
సై రా నరసింహ రెడ్డి రిలీజ్ డేట్…?