మన్మథుడి కోసం?

అందమైన భామలు.. లేత మెరుపు తీగలూ… అంటూ ‘మన్మథుడు’గా నాగార్జున చేసిన సందడిని ప్రేక్షకులు ఇప్పట్లో మరిచిపోలేరు. ఇప్పుడు ఆయన మరోసారి మన్మథుడిగా మురిపించేందుకు రంగంలోకి దిగారు. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో నాగార్జున కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘మన్మథుడు 2’. పి.కిరణ్‌, నాగార్జున అక్కినేని నిర్మిస్తున్నారు. ఈసారి కూడా నాగ్‌ సరసన మెరుపు తీగల హంగామా ఎక్కువగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. రకుల్‌ప్రీత్‌ సింగ్‌తో పాటు సమంత కూడా ఓ కీలక పాత్రలో సందడి చేయబోతోందట. ఆమెతో పాటు మరో అగ్ర కథానాయిక కీర్తి సురేష్‌ కూడా నటించనుందని, చిత్రబృందం ఆమెతో సంప్రదింపులు జరుపుతోందని తెలుస్తోంది. కీర్తి ఎంపిక ఖాయమైందంటే చిత్రంలో ముగ్గురు అగ్ర కథానాయికలు నటిస్తున్నట్టవుతుంది. ప్రస్తుతం పోర్చుగల్‌లో ‘మన్మథుడు 2’ చిత్రీకరణ జరుగుతోంది.

Leave a Response