ఏపీ అసెంబ్లీ ఎన్నికలో తెదేపా ఘోర పరాజయం చవిచూడటంతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ సాయంత్రం రాజీనామా లేఖను గవర్నర్‌కు చంద్రబాబు పంపనున్నట్లు సమాచారం. మరికాసేపట్లో చంద్రబాబు మీడియా ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఫలితాలపై ఆయన మాట్లాడనున్నారు. ఏపీలో ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల ప్రకారం.. వైకాపా 150కిపైగా స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తుండగా.. తెదేపా కేవలం 24 స్థానాల్లో ముందంజలో ఉంది. అటు లోక్‌సభ స్థానాల్లోనూ తెదేపా ఒక చోట మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతుండగా.. వైకాపా 24 స్థానాల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరుస్తోంది.
previous article
పవన్ ఓటమి….