నాని కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం ‘గ్యాంగ్‌లీడర్’ఆర్ ఎక్స్ 100’ హీరో కార్తికేయ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. విక్రమ్ కె.కుమార్ దర్శకుడు. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ (సీవీఎం) నిర్మాతలు.ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. జూన్ 30 లోపు చిత్రాన్ని పూర్తి చేసి, ఆగస్టు 30న విడుదల చేయాలని నిర్ణయించారు దర్శకుడు మాట్లాడుతూ ‘‘విభిన్నమైన లుక్‌తో సాగే కుటుంబ కథా చిత్రమిది. సినిమాలో ఒక ఆసక్తికరమైన అంశం ఉంటుంది. అది ఏంటన్నది తెరపైనే చూడాలి. ఉన్నతమైన సాంకేతిక హంగులతో సాగే ఇలాంటి చిత్రం ఇంతకుముందెప్పుడూ రాలేదు’’ అన్నారు.
previous article
సరదాగా చల్లటి ప్రదేశాలకు మామా అల్లుళ్లు…..
next article
పూర్తిగా ధ్వంసమైన‘సాహో’ కారు