అడిలైడ్: ఆసీస్‌తో తొలి టెస్టు నాలుగో రోజు ఆటలో టీమిండియా బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. ఆట ప్రారంభంలోనే పుజారా(71) ఔటవ్వగా అనంతరం క్రీజులోకి వచ్చిన రోహిత్ శర్మ ఒకే ఒక్క పరుగు చేసి వెనుదిరిగాడు. భోజన విరామం అనంతరం కాసేపు మెరుపులు మెరిపించిన రిషభ్ పంత్(28; 16బంతుల్లో) భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. 98వ ఓవర్లో నాథన్ వేసిన బంతిని ఫించ్‌కు క్యాచ్ ఇచ్చి పంత్ పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం టీమిండియా 99 ఓవర్లు ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది.
next article
గర్జించిన భారత్ కెనడాను చిత్తు చేసి క్వార్టర్స్‌కు