కట్ట కట్టకో లెక్క

ఈనాడు, వరంగల్‌: పెళ్లిలోనో పేరంటంలోనో పేరు పేరునా కానుకలు రాసి ఇచ్చినట్లుగా పోలింగ్‌ బూత్‌ల వారీగా ఓటర్ల సంఖ్య తెలుసుకుని.. వారికి సరిపడా సొమ్ము లెక్కపెట్టి.. కట్టలుకట్టి వాటిమీద బూత్‌ నంబర్లు రాసి మరీ పంపిస్తూ దొరికిపోయారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కాజీపేటలోని సిద్ధార్థనగర్‌లో బుధవారం సాయంత్రం రూ.3 కోట్ల నగదు పట్టుకున్నారు.  వర్ధన్నపేట ప్రజాకూటమిలోని తెజస అభ్యర్థి దేవయ్యకు సంబంధించినవిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. కాజీపేట సిద్ధార్థనగర్‌ జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలు చేస్తుండగా, ఒక యువకుడి వద్ద రూ. 2.5 లక్షలు దొరికాయి.  3 కోట్ల వరకు నోట్ల కట్టలు దొరికాయి. ఎన్నికల అధికారులకు తెలియజేయగా వారు వచ్చి డబ్బు స్వాధీనం చేసుకొని యంత్రాలతో లెక్కింపు ప్రారంభించారు.

Leave a Response