ఉత్తర కోస్తా దిశగా ‘బుల్ బుల్’ దూసుకు వస్తోంది. అండమాన్ నికోబార్ దీవులకు సమీపంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నిన్నటికి తీవ్ర వాయుగుండంగా మారిన విషయం తెలిసిందే. ఇది మరో 12 గంటల్లో తుపాన్‌గా రూపాంతరం చెందుతుందని విశాఖ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అండమాన్‌కు పశ్చిమ వాయవ్య దిశగా 200 కిలోమీటర్లు, పారాదీప్‌కు దక్షిణ ఆగ్నేయ దిశగా 920 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది.ఇది తుపాన్‌గా మారే అవకాశం ఉండడంతో దీనికి ‘బుల్ బుల్’గా నామకరణం చేశారు. వాయవ్య దిశగా మెల్లగా కదులుతున్న తుపాన్ ఈనె 10వ తేదీ నాటికి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తుపాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, ముఖ్యంగా ఉత్తర కోస్తాలో భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
previous article
మొదటి సినిమానే వాయిదా…ధృవ్
next article
వెంకీమామ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్.
Related Posts
- /
- /No Comment
కియా క్రెడిట్ కొట్టేయడానికి ఆరాట పడుతున్నా వైసీపీ…
- /
- /No Comment