అప్పుడే పేరూ డబ్బూ వస్తాయి

నిన్న మొన్నటివరకు గ్లామరస్‌ క్యారెక్టర్స్‌కే పరిమితమైన మిల్కీ బ్యూటీ తమన్నా కొత్త దారిని ఎంచుకున్నారు. లేడీ ఓరియంటెడ్‌ సినిమాలపై (దేవి 2, రాజుగారి గది 3, ఓ కొత్త దర్శకుడితో మరో సినిమా) దృష్టి సారించారు. కథ నచ్చితే గ్లామరస్‌ రోల్స్‌కి కూడా సై అంటున్నారు. ఎప్పటికప్పుడు భిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో టాప్‌ హీరోయిన్ల లిస్ట్‌లో తన పేరు కచ్చితంగా ఉండేలా కష్టపడుతున్నారు. నటిగా మీరు ఇంత పేరు, అభిమానాన్ని సంపాదించుకున్నారు.

ఈ సక్సెస్‌ సీక్రెట్‌ ఏంటి? అనే ప్రశ్నను తమన్నా ముందు ఉంచితే – ‘‘పేరు, డబ్బు, సౌకర్యవంతమైన జీవితం కోసం మాత్రమే యాక్టింగ్‌ ప్రొఫెషన్‌ను ఎంచుకుంటున్నారని చాలామంది ఆలోచిస్తుంటారు. కానీ అది నిజం కాదు. నటన పట్ల తపన లేకపోతే ఇండస్ట్రీలో ఎక్కువకాలం నిలవలేం. నా సక్సెస్‌కి కారణం అదే. యాక్టర్‌గా ప్రూవ్‌ చేసుకున్న తర్వాత మాత్రమే పేరు, డబ్బు వస్తాయి. అప్పటివరకు అలుపెరుగని పోరాటం చేయాల్సిందే. కష్టపడకుండా ఏదీ వచ్చేయదు’’ అని చెప్పుకొచ్చారు. ఒకవేళ మీరు యాక్టర్‌ కాకపోయి ఉంటే ఏ రంగాన్ని ఎంచుకునేవారు అని అడగ్గా – ‘‘యాక్టింగ్‌ లేకుండా నా లైఫ్‌ని ఇప్పుడు ఊహించుకోలేను. అయితే మెడికల్‌ సెక్టార్‌లో మా ఫ్యామిలీ మెంబర్స్‌ ఉన్నారు. సో… మెడిసన్‌ చదివేదాన్నేమో’’ అని చెప్పారు.

Leave a Response