అజయ్‌ దర్శకత్వంలో విక్రమ్‌

డిమాండి కాలనీ’, ‘ఇమైకా నొడిగల్‌’ వంటి రొటీన్‌కు భిన్నమైన చిత్రాలతో తనలోని ప్రతిభను చాటుకుంటున్న దర్శకుడు అజయ్‌ జ్ఞానముత్తు. తదుపరి ఆయన విక్రమ్‌ హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం రాజేష్‌ సెల్వ దర్శకత్వంలో ‘కడారం కొండాన్‌’లో నటిస్తున్నారు విక్రమ్‌. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. దీని తర్వాత వీరి చిత్రం మొదలవుతుందని కోలీవుడ్‌ వర్గాల సమాచారం. అయితే మణిరత్నం దర్శకత్వంలోని ‘పొన్నియిన్‌ సెల్వం’ చిత్రం కోసం విక్రం తన శరీరాకృతిని ఆ పాత్రకు తగ్గట్లు మార్చుకుంటున్నారని, ఈ సినిమా తర్వాత అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో నటిస్తారని సమాచారం. ఒకవేళ పొన్నియిన్‌ సెల్వం ఆలస్యమైతే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశముందని తెలుస్తోంది. మొత్తానికి ఇటీవల జ్ఞానముత్తు చెప్పిన కథ విక్రమ్‌కు నచ్చడంతో ఈ సినిమా ఖరారైందని కూడా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. హర్రర్‌, థ్రిల్లర్‌ చిత్రాలతో ఆకట్టుకున్న జ్ఞానముత్తు.. విక్రమ్‌ హీరోగా ఎలాంటి సినిమాను రూపొందిస్తారో వేచి చూడాలి.

Leave a Response