ఫ్లాప్‌ల కారణంగా తనకు అవకాశాలు తగ్గాయనే ప్రచారం చేస్తున్నారని నటి రకుల్‌ప్రీత్‌సింగ్ ఆవేదనను వ్యక్తం చేసింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ” వరుస ఫ్లాప్‌ల కారణంగానే కొత్త చిత్రాల అవకాశాలు రావడం లేదని కొందరు ప్రచారం చేస్తున్నారు. నిజం చెప్పాలంటే నేను నటిగా పరిచయమైన తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ అంతస్తును అందుకున్నా. అయితే వచ్చిన అవకాశాలన్నీ అంగీకరించి నటించడం వల్లే ఫ్లాప్‌లను ఎదుర్కోవలసిన పరిస్థితి వచ్చింది. హిందీలో పలు అవకాశాలు రావడంతో దక్షిణాదిలో అవకాశాలను అంగీకరించలేకపోతున్నాను. .అంతేకానీ నాకు అవకాశాలు రాక కాదు. తమిళ, తెలుగు భాషల్లో ప్రముఖ నటులతో నటించా, కమలహాసన్ వంటి ప్రముఖ నటుడితో కలిసి నటించే అవకాశం ఇంతత్వరగా వస్తుందని ఊహించలేదు. ఇకపోతే హిందీలో రన్వీర్‌సింగ్, తెలుగులో విజయ్‌దేవరకొండలతో జతకట్టాలన్న కోరిక ఉంది. అలాంటి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న” అని రకుల్‌ప్రీత్‌సింగ్ పేర్కొంది.
Tools