సోనామార్గ్‌లో మైన‌స్ నాలుగైదు డిగ్రీల చ‌లిలో…

బాబీ దర్శకత్వంలో వెంకటేశ్, నాగచైతన్య తొలిసారి కలిసి నటిస్తోన్నచిత్రం ‘వెంకీమామ’. ఈ సినేమా డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందు రానుంది. కానీ అదే రోజు వెంకటేశ్ పుట్టినరోజు కావడం విశేషం.ఈ సినిమాకు డి. సురేశ్‌బాబు, టి.జి. విశ్వప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో వెంకీ సరసన పాయల్ రాజ్‌పుత్, చైతూ జోడీగా రాశీ ఖన్నా నటించారు. కొన్ని రోజుల క్రితం వరకు ఈ సినిమా విడుదల విషయంలో చాలా సందిగ్ధత నెలకొంది. సంక్రాంతికి ఈ మూవీని తీసుకురావాలా లేక డిసెంబర్‌లోనే విడుదల చెయ్యాలా అనే విషయంలో నిర్మాతలు ఉన్నారు.నాగ‌చైత‌న్య ఇందులో ఆర్మీ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టించారు. ఆయ‌నపై కాశ్మీర్‌లో స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. సోనామార్గ్‌లో మైన‌స్ నాలుగైదు డిగ్రీల చ‌లిలో యూనిట్ చైత‌న్య‌పై ఉన్న స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించింది. ఈ షూటింగ్‌ ప్రాంతానికి చేరుకోవాలంటే కేవ‌లం గుర్రాల‌పైనే వెళ్లాల్సి ఉంటుంది. అలా యూనిట్ ఎంతో క‌ష్ట‌ప‌డి ఈ ప్రాంతంలో స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. మేనమామ మేనల్లుళ్లయిన వెంకీ, చైతూ కలిసి నటించడమే ఈ సినిమాకి ప్రేక్షకుల్ని రప్పిస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు. అందుకే ప్రచార కార్యక్రమాలకు తగినంత సమయం లేకున్నా విడుదలకు సిద్ధపడుతున్నారు.

Tags:Venkatesh

Leave a Response