రాజుగారి గది-3
లో హీరోయిన్గా ముందు మిల్కీబ్యూటీ తమన్నాను అనుకున్నారు. సినిమా ప్రారంభోత్సవంలో కూడా ఆమె పాలుపంచుకుంది. కొన్ని కారణాల వలన తమన్నా స్థానంలోకి అవికా గౌర్ వచ్చింది. ఓ ఇంటర్వ్యూలో ఓంకార్ మాట్లాడుతూ ఈ సినిమాలో ముందుగా తమన్నాను తీసుకున్న మాట వాస్తవం. ముందుగా ఆమెకు సినిమా లైన్ మాత్రమే చెప్పాం. ఆమెకు నచ్చింది. సినిమా ప్రారంభమవడానికి కొద్దిరోజుల ముందు ఫుల్ నెరేషన్ ఇచ్చాం. దానికి ఆమె చాలా మార్పులు చెప్పారు. తన పాత్రను మార్చమని, దానికి సరిపడే విధంగా కథ కూడా మార్చమని అడిగారు. అయితే సినిమా ప్రారంభమవడానికి కొద్ది రోజులే ఉండడంతో కథలో మార్పులు చేయడానికి మాకు సమయం లేదు. దాంతో తమన్నా వద్దనుకున్నాం. తాప్సీ, కాజల్ వంటి హీరోయిన్ల కోసం ప్రయత్నించాం. కానీ, వారి డేట్లు ఖాళీగా లేవు. దాంతో అవికా గౌర్ను తీసుకున్నామ
ని ఓంకార్ అన్నారు.