రొమాంటిక్ చిత్రాలకు ప్రస్తుతం ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని చాలామంది దర్శకులు అటువంటి చిత్రాలవైపు ఆడుగులు వేస్తున్నారు. ‘నాకిదే ఫస్ట్ టైమ్’.శ్రీవల్లిక ప్రొడక్షన్స్ పతాకంపై వస్తున్న ఈ సినిమాకు ముస్కు రాంరెడ్డి దర్శకుడు. చింటు కంచర్ల, కావ్యకీర్తి, అదిత్య రెడ్డి కె.ధనుష్ బాబు, సోఫియా, ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కురుపాల విజయ్‌కుమార్ నిర్మాత. ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్‌ను పూర్తిచేసుకుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రచార పోస్టర్లు యువతలో సెగలు రేపేలా ఉన్నాయి.చిత్ర నిర్మాత విజయ్ కుమార్ మాట్లాడుతూ డైరెక్టర్ రాం రెడ్డి చెప్పిన కథ అద్భుతంగా ఉందన్నారు. ఇదో చక్కటి ప్రేమ కథ అని పేర్కొన్నారు. చాలా రిచ్‌గా ఉండే ఈ మూవీలో అనేక ట్విస్టులు ఉంటాయన్నారు. సింగర్ శ్రావణ భార్గవి పాడిన పాట ఈ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తుందన్నారు. సెకెండ్ షెడ్యూల్‌ను ప్రారంభించి గోవా, అరకులలో పాటలను చిత్రీకరించనున్నట్టు తెలిపారు.