బాలకృష్ణ చాలా వేగంగా సినిమాలు చేస్తూ టాలీవుడ్ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన యువ హీరోలతో పోటీపడి సినిమాలు చేస్తున్నారు. త్వరగా తన ప్రాజెక్టులను పట్టాలెక్కించే విషయంపైనే ఆయన ఎక్కువగా దృష్టిపెడతారు. పారితోషికం గురించి ఆయన పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించవు. అయితే ప్రస్తుతం ఆయన కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో, సి.కల్యాణ్ నిర్మాణంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకిగాను ఆయన 10 కోట్ల పారితోషికం అందుకున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. ఇంతకుముందు నాలుగైదు కోట్లు మాత్రమే తీసుకున్న బాలకృష్ణ, ఈ సినిమా కోసం ఈ స్థాయిలో పారితోషికం అడిగినా సి.కల్యాణ్ వెనకడుగు వేయలేదట. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో వున్నట్టు సమాచారం.