టాలీవుడ్ యాంగ్ హీరో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ సతీమణి ఉపాసన, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మంచి స్నేహితులనే సంగతి మన అందరికి తెలిసిందే. ఇద్దరూ కలిసి ఒకే జిమ్‌లో ఫిట్నెస్ కోచ్ పర్యవేక్షణలో కసరత్తులు చేస్తుంటారు. సానియాతో కలిసి తను వ్యాయామం చేస్తున్న ఫొటోలను గతంలో కూడా ఉపాసన షేర్ చేశారు. తాజాగా సానియా జన్మదినోత్సవం సందర్భంగా ఉపాసన మరో ఫొటోను షేర్ చేశారు.జిమ్‌లో సానియాతో కలిసి వ్యాయామం చేస్తున్న ఫోటోను షేర్ చేసిన ఉపాసన.. హ్యాపీహ్యాపీ బర్త్‌డే సానియా. నా ఫిట్నెస్ ఇన్స్పిరేషన్. వ్యాయామం విషయంలో నాకు స్ఫూర్తి కలిగించినందుకు ధన్యవాదాలు. ఈ రోజు నిన్ను మిస్సవుతున్నా. మళ్లీ త్వరలోనే జిమ్‌లో కలుసుకుందాం
అని ఉపాసన ట్వీట్ చేయడం టాలీవుడ్ లో విశేషం గా మారింది.