రానా న్యూ సాంగ్…యాక్షన్

కోలీవుడ్ యాక్షన్ హీరోల లిస్ట్ లో విశాల్ పేరు ముందు వరుసలో ఉన్న విషయం తెలిసిందే. యాక్షన్ సినిమాలే ఆయనకి ఎక్కువ క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. ఈ సారి ఆయన ‘యాక్షన్’ అనే టైటిల్ నే సెట్ చేసుకుని వస్తున్నాడు. సుందర్ .సి దర్శకత్వం వహించిన ఈ సినిమాను, ఈ రోజు విడుదల చేశారు దర్శకుడు. ఈ సినిమా తెలుగు వెర్షన్ కోసం రానా ఒక పాట పాడాడు. నిన్న ఆ పాటను వదిలారు. ‘లైట్స్ .. కెమెరా .. .యాక్షన్ .. ‘ అంటూ ఈ సాంగ్ సాగుతోంది. హీరో యాక్షన్ సన్నివేశాలపై ఈ సాంగ్ ప్లే అవుతూ వుంటుందనే విషయం విజువల్స్ ను బట్టి అర్థమవుతోంది. ర్యాప్ తరహాలో సాగే ఈ పాటను రానా పాడటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనే ఉద్దేశంతోనే విశాల్ పాడించాడు.

Leave a Response