దర్శక ధీరుడు, `బాహుబలి`తో తెలుగు సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన రాజమౌళి ప్రస్తుతం `ఆర్ఆర్ఆర్`తో బిజీగా వున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలు గా రాజమౌళి రూపొందిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈరోజు (గురువారం) రాజమౌళి జన్మదినోత్సవం. ఈ సందర్బంగా పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా రాజమౌళికి విషెస్ తెలియజేసారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలు రాజమౌళిగారు. మీరు ఎప్పుడూ ఇలాగే హద్దులు చెరిపేస్తూ ఇండియన్ సినిమాకు కొత్త ప్రమాణాలు నిర్దేశించాలి – రామ్ చరణ్ హ్యాపీ బర్త్ డే రాజమౌళిగారు. ఇలాగే సినీ పరిశ్రమలో ఉన్న దర్శకులకు మీరు ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నా – మహేష్ బాబు మా కెప్టెన్ రాజమౌళిగారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మీరు మాకు ఎల్లప్పుడూ ఆదర్శనీయం. – రానా సినీ మాంత్రికుడు, భారతీయ సినిమా గర్వించదగిన దర్శకుడు రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు నా సెల్యూట్. – కరణ్ జోహార్ భారతీయ సినిమా గర్వంగా చెప్పుకునే రాజమౌళికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు – మెహర్ రమేష్
previous article
రాహుల్ పునర్నవి మధ్య.?
next article
జీవీప్రకాష్ రెండోసారి హారర్ చిత్రంలో..