తెలుగు .. తమిళ భాషల్లో మాస్ యాక్షన్ హీరోగా విశాల్ కి మంచి క్రేజ్ వుంది. ఈ కారణంగానే మొదటి నుంచి కూడా ఆయన సినిమాలు తమిళంతో పాటు తెలుగులోను విడుదలవుతూ వస్తున్నాయి. అలా ఆయన తాజా చిత్రంగా రూపొందిన ‘యాక్షన్’.. తమిళంతో పాటు తెలుగులోను ఈ నెల 15వ తేదీన విడుదలైంది. విశాల్ కెరియర్లోనే అత్యధిక బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా అక్కడ యావరేజ్ టాక్ తెచ్చుకుంది.తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా తొలి రెండు రోజుల్లో 1.18 కోట్లను వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 7.2 కోట్లకి అమ్ముడైన ఈ సినిమా, రెండు రోజుల్లో సాధించిన మొత్తం చాలా తక్కువనే చెప్పాలి. ఈ వారాంతం వరకూ వసూళ్లపరంగా ఈ సినిమా ఏ స్థాయివరకూ వెళుతుందో చూడాలి. భారీ యాక్షన్ చుట్టూ బలమైన కథను అల్లుకోకపోవడం వల్లనే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
next article
లారీ డ్రైవర్ పాత్రలో రఫ్ లుక్ తో బన్నీ
Related Posts
- /No Comment
మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్లో…
- /No Comment