లారీ డ్రైవర్ పాత్రలో రఫ్ లుక్ తో బన్నీ

అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ సినిమాతో తన అభిమానులను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. సంక్రాంతికి ఈ సినిమా భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమా తరువాత దర్శకుడు సుకుమార్ తో కలిసి బన్నీ సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుంది.ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్ పాత్రలో రఫ్ లుక్ తో బన్నీ కనిపించనున్నాడట. ఇక ఆయన ఈ పాత్రలో చిత్తూరు యాసలో మాట్లాడతాడని అంటున్నారు. చిత్తూరు యాసలో మాట్లాడటం కోసం బన్నీ ప్రత్యేకంగా ఒక ట్రైనర్ ను నియమించుకున్నాడని చెబుతున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన కథానాయికగా నటించనుండగా, ప్రతినాయకుడి పాత్రలో విజయ్ సేతుపతి కనిపించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగుకి వెళ్లనుంది.

Leave a Response