జనసేన పార్టీ మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతోందని పవన్ కల్యాణ్ తెలిపారు

వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఇసుక విధానంలోని లోపాల వల్ల 50 మంది భవన నిర్మాణ కార్మికులు ప్రాణాలు కోల్పోయారని, 35 లక్షల మంది కార్మికులు ఉపాధిని కోల్పోయారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. అయితే, చేసిన తప్పులను ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తెలుసుకునేలా చేసిన మీడియా, రాజకీయ నేతలు, సామాన్య ప్రజలకు జనసేన పార్టీ మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతోందని ఆయన ట్వీట్ చేశారు. అక్రమ ఇసుక మైనింగ్ పై జనసైనికులు పూర్తి స్థాయిలో నిఘా ఉంచాలని సూచించారు. ఇసుక అవినీతిపై జనసేన పోరాటాన్ని ప్రారంభించిందని, జనసైనికులంతా పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని కోరారు.

Leave a Response