ప్రముఖ బుల్లితెర యాంకర్ సుమ తన నివాసంలో జీఎస్టీ దాడులు జరిగినట్టు వస్తున్న వార్తలపై స్పందించారు. తన నివాసంలో జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహించినట్టు వార్తలు వచ్చాయని, వాటిలో నిజం లేదని స్పష్టం చేశారు. తన నివాసంలో ఎలాంటి తనిఖీలు జరగలేదని చెప్పారు. తెలుగు ఎంటర్టయిన్ మెంట్ రంగంలో అత్యధికంగా జీఎస్టీ చెల్లిస్తున్నవారిలో తాను కూడా ఉన్నానని సుమ వెల్లడించారు. ఎలాంటి బకాయిలు లేకుండా క్రమం తప్పకుండా జీఎస్టీ చెల్లిస్తున్నానని ఆమె వివరించారు. హైదరాబాదులో శుక్రవారం జీఎస్టీ అధికారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. వారిలో పలువురు ప్రముఖులు కూడా ఉన్నారు.
previous article
‘ఫైటర్’ సినిమాలో విలన్ పాత్రలో కార్తికేయ
next article
అభిమానితో కలిసి బ్రేక్ ఫాస్ట్….
Related Posts
- /No Comment
నితిన్ తాజా చిత్రంగా రూపొందుతున్న ‘భీష్మ’
- /No Comment