ఇండోర్ లో బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ లో 6 వికెట్ల నష్టానికి 493 పరుగులు చేసింది. డబుల్ సెంచరీ హీరో మయాంక్ అగర్వాల్ 243 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ కాగా, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 60 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఆట చివర్లో ఉమేశ్ యాదవ్ సిక్సర్లతో విరుచుకుపడడం హైలైట్ గా నిలిచింది. ఉమేశ్ 1 ఫోర్, 3 సిక్సర్ల సాయంతో 10 బంతుల్లోనే 25 పరుగులు చేశాడు. బంగ్లా బౌలర్లలో మీడియం పేసర్ అబు జాయేద్ కు 4 వికెట్లు దక్కాయి. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 150 పరుగులకే ఆలౌట్ కాగా, ప్రస్తుతం టీమిండియా 343 పరుగుల ఆధిక్యంతో ఉంది.
previous article
రానా న్యూ సాంగ్…యాక్షన్
next article
సోషల్ మీడియాలో యువీ, సానియా సరదా సంభాషణలు
Related Posts
- /No Comment
ఈ సినిమా హిట్టవ్వకపోతే…
- /No Comment