ఒకప్పుడు లవర్ బాయ్‌గా అనిపించుకున్న నటుడు మాధవన్. వయసు పెరుగుతున్నప్పటికీ ఆయనలోని ఛార్మ్ ఏమాత్రం తగ్గలేదు. అందుకేనేమో ఓ యువతి ఆయనపై మనసు పారేసుకుంది. అసలేం జరిగిందంటే.. మంగళవారం మాధవన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సెల్ఫీని పోస్ట్ చేశారు. ‘ఎడిటింగ్ చాలా కష్టంతో కూడుకున్న పని. మరోపక్క ఫన్నీగానూ ఉంటుంది. రోజంతా ప్రయాణం చేసొచ్చాను. నేను వృద్ధుడిని అయిపోతున్నాను’ అంటూ తన సెల్ఫీకి క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫొటోపై నైనా అనే నెటిజన్ కామెంట్ చేస్తూ.. ‘నాకు 18 ఏళ్లు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. తప్పంటారా?’ అని ప్రశ్నించింది. ఇందుకు మాధవన్ స్పందిస్తూ.. ‘హ్హ హ్హ.. గాడ్ బ్లెస్ యూ. నాకంటే మెరుగైన వ్యక్తి మీకు తప్పకుండా దొరుకుతాడు’ అని సమాధానమిచ్చారు. మాధవన్‌కు అమ్మాయిల్లో ఉన్న క్రేజ్ ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదని దీనిని బట్టే తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ‘రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్’ అనే చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇందులో ఆయన ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ పాత్రలో నటిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత అనంత్ మహాదేవన్, మాధవన్ సంయుక్తంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు. దీంతో పాటు మాధవన్.. ‘నిశ్శబ్ధం’ అనే చిత్రంలో అనుష్కకు జోడీగా నటిస్తున్నారు.
previous article
ఎన్టీఆర్ స్పీడుగా డ్రైవ్ చేస్తాడు అంటూన పూరి …..
next article
చిరుతో పవన్‌కల్యాణ్ ….
Related Posts
- /No Comment
విజయ్ దేవరకొండ సినిమా ఆగిపోయిందా.?
- /No Comment