బాచుపల్లి వీఎన్ఆర్ కాలేజీ వద్ద బుక్కైన ప్రిన్స్..

మందుబాబులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఎక్కడిక్కడ డ్రంకెన్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ మందుబాబుల్లో పెద్దగా మార్పు రావడం లేదు. సినీ హీరో ప్రిన్స్ డ్రంకెన్ డ్రైవ్ లో అడ్డంగా బుక్ అయ్యాడు. బాచుపల్లిలోని వీఎన్ఆర్ కాలేజీ వద్ద డ్రంకెన్ డ్రైవ్ లో దొరికాడు. ఈ నెల 24న ఇది జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.డ్రంకెన్ డ్రైవ్ కేసు నేపథ్యంలో ఈరోజు కూకట్ పల్లి 4వ మెట్రోపాలిటన్ స్పెషల్ కోర్టుకు ప్రిన్స్ హాజరయ్యాడు. అతనికి కోర్టు రూ. 5 వేల జరిమానా విధించింది. డ్రంకెన్ డ్రైవ్ లో తొలిసారి పట్టుబడటంతో… కేవలం తక్కువ జరిమానాతోనే సరిపెట్టారు. లేకపోతే మరింత ఎక్కువ జరిమానాతో పాటు… జైలు శిక్ష పడి ఉండేది.

Image result for sundeep kishan

Leave a Response