నానిగా అందరికీ సుపరిచితమయిన తెలుగు నటుడు నవీన్ బాబు ఘంటా. పుట్టిన ఊరు చల్లపల్లి (కృష్ణాజిల్లా) అయినా నాని చిన్నతనంలోనే తల్లిదండ్రులు హైదరాబాద్ లో స్ధిరపడ్డారు. శ్రీను వైట్ల మరియు బాపు వద్ద సహాయదర్శకుడిగా పనిచేశాడు. తరువాత హైదరాబాద్‌లో కొన్ని రోజులు రేడియో జాకీగా కూడా పనిచేసాడు. ఒక వాణిజ్య ప్రకటన ద్వారా అష్టా చమ్మా అనే తెలుగు సినిమాలో నటించాడు. ఆ తరువాత నానికి ఎన్నో సినిమాలలో నటించే అవకాశం వచ్చింది. నాని నటించిన ఈగ కూడా ప్రేక్షకులనుంచి, విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఉన్న హీరోల్లో నాని తన నటనతో న్యాచురల్ స్టార్‌గా పిలవబడుతున్నాడు. 2015 ప్రథమార్ధంలో వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం 2017 లో వచ్చిన MCA(మిడిల్ క్లాస్ అబ్బాయి) చిత్రం వరకు వరుసగా ఎనిమిది విజయాలను అందుకున్నాడు. 2014 లో నాని నిర్మాతగా డీ ఫర్ దోపిడీ అనే చిత్రాన్ని నిర్మించారు. ఆ! అనే చిత్రాన్ని నిర్మించి నిర్మాతగా కూడా విజయాన్ని అందుకున్నాడు. 2018 ఏప్రిల్ లో వచ్చిన కృష్ణార్జున యుద్ధంలో నటించాడు. కానీ అది సరి అయిన ఫలితం ఇవ్వలేదు. మా టీవీలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ 2 వ సీజన్ కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు నాని.2018 లో కింగ్ నాగార్జున అక్కినేని గారితో దేవదాస్ సినిమాలో కలిసి నటించారు.2019లో జెర్సీ సినిమాతో మన ముందుకు వచ్చాడు. ఎల్లా ఎన్నో సినిమాలో నటించి తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతానికి గ్యాంగ్ లీడర్ సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నాడు. తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ టాలీవుడ్లో సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ‘అ ఆ’ సినిమాతోనే అనిరుధ్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలని భావించినా వర్క్ అవుట్ కాకపోవటంతో అజ్ఞాతవాసితో అడుగుపెట్టాడు. అయితే తొలి సినిమా నుంచే టైంకు ట్యూన్ ఇవ్వడన్న అపవాదు అనిరుధ్ మీద ఉంది. దీనికి తోడు అజ్ఞాతవాసి డిజాస్టర్ కావటంతో టాలీవుడ్లో అనిరుధ్ ఆశలు గల్లంతయ్యాయి. తరువాత చేసిన జెర్సీ హిట్ అయినా అనిరుధ్ కు ప్రత్యేకంగా గుర్తింపేమీ రాలేదు. అయితే నాని హీరోగా అభిమానుల ముందుకు వస్తున్న ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇంకా నాని సినిమాల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
previous article
క్రికెటర్ తో యాక్టర్ …
next article
పవన్ కళ్యాణ్ న్యూ లుక్…
Related Posts
- /No Comment
మాస్ ఇమేజ్ ను కూడా కాపాడుకునే ఆలోచనలో రామ్..?
- /No Comment