క్రికెటర్ తో యాక్టర్ …

టాలీవుడ్ యాంగ్ టైగర్ ఎన్టీఆర్ లోని కళాభిమానానికి ముగ్ధులై బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రములో బాలనటునిగా తెలుగు చిత్రసీమకు పరిచయం చేశాడు. తరువాత బాల రామాయణము చిత్రములో రాముడిగా నటించాడు. ఆ సమయంలో నట శిక్షకుడు ఎన్.జె. భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాడు. 2001లో హీరోగా నిన్ను చూడాలని చిత్రం ద్వారా తెరంగేట్రం చేశాడు. ఆ చిత్రంతో ప్రేక్షకులను ఆకర్షించగలిగాడు. ఆ తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెం.1 చిత్రం ద్వారా విజయం, మంచి పేరు సాధించాడు. ఆ చిత్రం విజయవంతమవడంతో విరివిగా అవకాశాలు రాసాగాయి. ఆ తర్వాత వచ్చిన సుబ్బు పరాజయం పొందింది . ఆ తర్వాత వి.వి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఆది చిత్రంలో అతని నటన చూసి ఎంతో మంది అతని అభిమానులుగా మారారు. మళ్ళీ అల్లరి రాముడు బాగా ఆడలేదు . ఆ తరువాతి సింహాద్రి చిత్రం మాత్రం తెలుగు సినీ చరిత్ర లోనే అత్యంత భారీ విజయాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఈ సినిమా విజయంతో అతను అగ్ర నటులలో ఒకనిగా ఎదిగాడు. ఐతే సింహాద్రి చిత్రం తర్వాత అతని చిత్రాలు వరుసగా బాగా ఆడలేదు . బాగా లావయ్యాడన్న విమర్శలు కూడా వచ్చాయి. వరుసగా ఆంధ్రావాలా, సాంబ, నా అల్లుడు, నరసింహుడు, అశోక్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద చతికిల పడ్డాయి . రాఖీ చిత్రం ఒకమాదిరిగా ఆడింది కాని అందులో అతని నటన విమర్శకుల ప్రశంశలనందుకుంది. ప్రస్తుతం మనోడు ఇండియ‌న్ క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తో ఓ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ కోసం క‌లిసి ప‌నిచేయ‌బోతున్నారు. వివ‌రాల్లోకెళ్తే.. మ‌ద్యం సేవించి వాహ‌నాలు న‌డ‌ప‌డం వ‌ల్ల రోడ్డు ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయి. కుటుంబాలు రోడ్డున ప‌డుతున్నాయి. దీనిపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న‌ను పెంచేందుకు ఎన్‌.డి.టి.వి ఓ అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌ను నిర్వ‌హించ‌నుంది. అందులో భాగంగా ఇండియ‌న్ క్రికెట్ టీమ్ కెప్టెన్‌ విరాట్ కోహ్లీ, తార‌క్ క‌లిసి వ‌ర్క్ చేయ‌బోతున్నారని టాక్‌. వీరితో పాటు వివిధ రంగాల‌కు చెందిన 7గురు సెల‌బ్రిటీలు ప్ర‌చారక‌ర్త‌లుగా ప‌నిచేయ‌నున్నారు. త్వ‌ర‌లోనే ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంది.

Image result for virat kohli and ntr

Leave a Response