ఒక సినిమా వాయిదా ఇంకొక్క సినిమా మొదలు…

టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున. తన నటనతో టాలీవుడ్ అభిమానులను ఎంతగానో మెప్పించ్చరు.ప్రస్తుతం మన్మథుడు-2 తర్వాత కింగ్ ఇప్పటివరకు మరో సినిమాను పట్టాలెక్కించలేదు. సోగ్గాడే చిన్ని నాయనాకు సీక్వెల్‌గా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలోనే బంగార్రాజు సినిమా చేయాలని నాగ్ భావించారు. ఈ మేరకు కల్యాణ్ కృష్ణ చాలా సమయం వెచ్చించి స్క్రిప్టు కూడా సిద్ధం చేశాడు. నాగార్జున, నాగచైతన్య ఈ సినిమాలో కలిసి అభిమానుల ముందుకు వస్తున్నారు. అయితే ఈ సినిమా ఇప్పట్లో ఉండదని తెలుస్తోంది.చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. చైతూ కోసం చాలా మంది డైరెక్టర్లు క్యూలో ఉండడటం టాలీవుడ్ లో విశేషం. మరోవైపు దర్శకుడు కల్యాణ్ కృష్ణ వ్యక్తిగత కారణాల రీత్యా కొంతకాలం బ్రేక్ తీసుకోవాలని భావిస్తున్నారట. దీంతో బంగార్రాజు సినిమా ఇప్పట్లో లేనట్టే అని అనుకుంటున్నారు. బంగార్రాజు వాయిదా పడడంతో కొత్త దర్శకుడు సొలమన్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయడానికి నాగ్ అంగీకరించినట్టు టాలీవుడ్ టాక్.

Image result for nagarjuna

Leave a Response