ఇలాంటి పాత్ర చేయలేదు…తమన్నా

టాలీవుడ్.. తమిళ భాషల్లో ఆ మధ్య మీల్క్ బ్యూటీ తమన్నా బాగా వెనుకబడిపోయిందన విషయం మా అందరికి తెలిసిందే. అలాంటి పరిస్థితుల్లో ఆమెను ‘ఎఫ్ 2’ సినిమా ఆదుకుంది. అప్పటి నుంచి ఈ రెండు భాషల్లోని సినిమాల్లో ఆమె మళ్లీ కనిపిస్తోంది. ఇటీవల తెలుగులో విడుదలైన ‘సైరా’ సినిమాలో మీల్క్ బ్యూటీ మరింత ఊతాన్నిచ్చింది. ఆమె తాజా సినిమా ‘యాక్షన్’, తెలుగు .. తమిళ భాషల్లో ఎల్లుండి అభిమానుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మీల్క్ బ్యూటీ మాట్లాడుతూ .. ‘యాక్షన్’ సినిమాలో విశాల్ జోడీగా నటించాను. ఆయనతో పాటు నేను కూడా కమెండో ఆఫీసర్ గానే చేశాను. ఈ సినిమాలో నేను యాక్షన్ సీన్స్ .. ఛేజింగ్ సీన్స్ లోను కనిపిస్తాను. ఈ తరహా పాత్రను చేయడం థ్రిల్లింగ్ గా అనిపించింది. ఇక ఫైట్లు మాత్రమే కాదు .. విశాల్ కి నాకూ మధ్య రొమాంటిక్ సాంగ్స్ కూడా ఆకట్టుకునేలా వుంటాయి. సుందర్ సి. దర్శకత్వం వహించిన ఈ సినిమా, నా కెరియర్లో ప్రత్యేకమైనదిగా నిలుస్తుందని భావిస్తున్నాను” అని చెప్పుకొచ్చింది

Image result for thammana

Leave a Response