గాంధీజీ 150వ జయంతి సందర్భంగా ఇటీవల ఉత్తరాది నటీనటులతో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి దక్షిణాది స్టార్స్ ఎవరినీ ఆహ్వానించలేదు. దీనిపై ముందుగా ఉపాసన స్పందించింది. దక్షిణాది చిత్ర పరిశ్రమను నిర్లక్ష్యం చేయవద్దంటూ సున్నితంగా ట్వీట్ పెట్టారు. ఉపాసన ట్వీట్ ఓ రేంజ్లో వైరల్ అయ్యింది. ఈ ట్వీట్ గురించి రామ్చరణ్ను అడిగితే “ఉపాసన ప్రధాని మోదీగారిని ఎక్కడా విమర్శించలేదు. గౌరవంగా తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఖుష్బూగారు మరో స్థాయికి తీసుకెళ్లారు. నిజానికి ఉపాసన ట్వీట్ గురించి నాకు ఎప్పటికో తెలిసింది. దీనిపై తనని అడగ్గా..మోదీ ట్వీట్ చేస్తున్నట్లు చెబితే నువ్వు వద్దంటావని చెప్పకుండా చేశానంది“ అంటూ రామ్చరణ్ తెలిపారు.
previous article
ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు..!
next article
కమ్మరాజ్యంలో కడపరెడ్లు ట్రైలర్ రిలీజ్