ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు..!

బోర్డుతో కుదుర్చుకున్న ఒప్పందం విషయంలో షకీబల్ విధానపరమైన ఉల్లంఘనకు పాల్పడ్డాడని, అతడిపై చట్టపరమైన చర్యలు తప్పవని బీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నిజాముద్దీన్ చౌధురీ హెచ్చరించారు. ఓ టెలికం కంపెనీతో స్పాన్సర్‌షిప్ డీల్ కుదుర్చుకున్న షకీబల్ బోర్డుతో కాంట్రాక్టు నిబంధనలు ఉల్లంఘించాడని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఆరోపించింది. అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. బంగ్లాదేశ్ జట్టును గతంలో స్పాన్సర్ చేసిన మొబైల్ ఆపరేటర్ గ్రామీఫోన్ సంస్థతో మంగళవారం షకీబల్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు. ‘‘ఈ విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకోక తప్పదు. ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కంపెనీతోపాటు షకీబల్ నుంచి కూడా పరిహారం వసూలు చేస్తాం’’ అని హసన్ పేర్కొన్నారు.ఆటగాళ్లతో వ్యక్తిగతంగా ఒప్పందం కుదుర్చుకుందని, దీనివల్ల బోర్డుకు పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లిందని హసన్ వివరించారు. దీంతో ఆ తర్వాత ఆటగాళ్లు ఎవరూ టెలికం కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకోరాదంటూ అగ్రిమెంట్ చేసుకున్నామని, ఇప్పుడా అగ్రిమెంట్‌ను షకీబల్ ఉల్లంఘించాడని పేర్కొన్నారు. సమ్మె చేస్తూనే షకీబల్ అగ్రిమెంటు కుదుర్చుకున్నాడని , ఇది పొగరుబోతు చర్య అని మండిపడ్డారు.

Tags:shakib al hussan

Leave a Response